లివర్ ఆరోగ్యానికి వరం ఈ పండ్లు..తప్పకుండా తినాల్సిందే !
samatha
29 MAY 2025
Credit: Instagram
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం మన ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటే అంత మంచిది. కానీ కొంత మంది ఆరోగ్యం విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు. కానీ అలా ఉండకూడదంట.
మనం మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన అది అనేక సమస్యలకు కారణం అవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శరీరంలో కీలక పాత్రపోషించే లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట.
అందువలన లివర్ పనితీరును మెరుగు పరిచి, ఆరోగ్యంగా బతకాలి అంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
పసుపు లివర్ పనితీరు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంటుంది.ఇందులోని యాంటీ ఫంగల్ లివర్ ను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందంట.
అంతే కాకుండా లివర్ పనితీరు మెరుగు పరిచి, లివర్ ఆరోగ్యం బాగుండాలంటే తప్పకుండా వెల్లుల్లిని మీ వంటల్లో చేర్చాలంట. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఉదయం కప్పు గ్రీన్ టీ తాగడం వలన అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు అంటుంటారు. కాగా, లివర్ ఆరోగ్యానికి గ్రీన్ టీ చాలా మంచిదంట.
ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాలైన వంట నూనెలు దొరుకుతున్నాయి. అయితే లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ప్రతి మహిళా తమ వంట రూమ్ లో ఆలివ్ ఆయిల్ ఉంచాలంట. దీనిని వాడటం వలన లివర్ బాగుంటుంది.
క్యారెట్ హెల్త్‌కి మంచిది. అందువలన రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇది లివర్ డిటాక్స్ఫికేషన్ చేస్తుంది. మన శరీరంలోని విష పదార్థాలు బయటికి పంపిస్తుంది.