బీట్ రూట్ జ్యూస్‌తో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే!
samatha
25 MAY 2025
Credit: Instagram
బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఉదయం బీట్ రూట్ జ్యూస్ తాగడం అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అంటారు.
అయతే బీట్ రూట్ జ్యూస్‌తో కలిపి ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన అవి ఆరోగ్యానికి చాలా మంచిదంట. అవి ఏవి అంటే?
అల్లంను బీట్‌రూట్ రసంతో కలిపి తీసుకోవడం వల్ల వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, అల్లంలో జింజెరాల్ ఉంటుంది, ఇవి గొంతు మంట నుంచి ఉపశమనంకలిగిస్తాయి.
బీట్‌రూట్ రసంతో పసుపు కలుపుకొని తాగడం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు.
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
బీట్ రూట్ జ్యూస్ లో యాపిల్ ముక్కలను కూడా కలుపుకొని తాగడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది.
క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ ప్రతి రోజూ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపుకు, రక్త ప్రసరణను పెంచడానికి దోహద పడుతాయి.
బీట్‌రూట్ రసంలో నారింజ పండ్లను జోడించడం వల్ల శక్తివంతమైన, రుచికరమైన పోషకాలు కలిగిన జ్యూస్ తయారు అవుతుంది. దీని వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.