మీకు ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే!

samatha 

2 MAY 2025

Credit: Instagram

కిడ్నీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ మూత్ర పిండాలకు సంబంధించిన అనేక సమస్యలు వస్తుంటాయి

ఇక చాలా మంది, చిన్న వయసులోనే కిడ్నీల సమస్యలతో సతమతం అవుతుంటారు. కిడ్నీ స్టోన్స్, కిడ్నీల వాపు వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు.

కొంత మంది కిడ్నీల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోక పోవడం వలన కిడ్నీ ఫెయిల్ అవుతుంటాయి. అసలు కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.

కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ముందు మూత్రం రంగు మారుతుంది. మూత్రం ఎర్రబడడం, మూత్రం నుండి దుర్వాసన రావడం వంటి లక్షణాలు  కనిపిస్తుంటాయి.

ఎప్పుడైతే కిడ్నీలు పనితీరు దెబ్బతింటుందో, అప్పుడు ఫిల్టరేషన్ ప్రక్రియ పై ప్రభావం క్కువగా ఉంటుంది. దీంతో చేతులు, కాళ్లు, ముఖం వంటి భాగాల్లో వాపు ఏర్పడుతుంది. 

ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ముఖం ఉబ్బినట్టు కనిపించడం, కొన్ని కొన్ని సార్లు తీవ్రమైన అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

అదే విధంగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి ముందు చర్మం పొడిబారుతుంది. కిడ్నీ అనారోగ్యంతో రక్తంలో ద్రవముల స్థాయిలు ఎప్పుడైతే పెరుగుతాయో, రక్తపోటు ఎక్కువ అవుతుంది.

ఇలాంటి సందర్భాల్లో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. పై లక్షణాలు కనుక ఉన్నట్లైతే వాటిని గమనించి తగిన జాగ్రత్తలను తీసుకోవడం వలన ప్రమాదం తక్కువగా ఉంటుందంట.