యువతలో ఈ లక్షణాలు ఉంటే పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నట్లే !

samatha 

29 MAY 2025

Credit: Instagram

ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకు క్యాన్సర్ కేసులనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది క్యాన్సర్ బారినపడుతున్నారు.

ఒకప్పుడు నలభై సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పడు యువత కూడా క్యాన్సర్ బారిన పడుతుంది.

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. అందుకే వైద్యులు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

ముఖ్యంగా యువతలో ఈ లక్షణాలు కనిపిస్తే పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్లేనంట. కాగా, ఆ లక్షణాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

మారుతున్న జీవన శైలీ, తీసుకుంటున్న ఆహారం వలన చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

25 నుంచి 49 ఏళ్ల వయసు మధ్య గల యువకులు ప్రస్తుత రోజుల్లో పెద్ద పేగు క్యాన్సర్ బారినపడుతున్నారంట. అయితే ఇది వారసత్వంగా లేదా,కొలిబాక్టిన్ బ్యాక్టీరియా వలన వస్తుందంట.

రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం లేదా అధిక బరువు ఊబకాయం వలన పెద్ద పేగు క్యాన్సర్ వస్తుందంట. అంతే కాకుండా పొగాకు వాడకం కూడా దీనికి కారణం అవుతుంది.

అయితే ఈ క్యాన్సర్ ఉంటే ఆకస్మికంగా బరువు తగ్గడం,మలబద్ధకం, మలంలో రక్తం పడటం, విపరీతమైన కడుపునొప్పి, బలహీనత, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయంట.