తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే తప్పకుండా కొన్ని ఆహారాలు తినాలి అంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
కివీ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్, పెగులోపల జెల్‌గా మారి కడుపు తిమ్మిరిని, మలబద్ధకం సమస్యను త్వరగా తగ్గిస్తుంది.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఇది జీర్ణక్రి సక్రమంగా సాగేలా చేసి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అవిసెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని నానబెట్టినప్పుడు ఇవి జెల్ లాంటి పొరను ఏర్పాటు చేస్తాయి. ఇవి పెగు కదలికలను మెరుగుపరుస్తాయి.
చియా సీడ్స్‌ను కొబ్బరి నీళ్లలో కలిపి తీసుకోవడం వలన త్వరగా మలబద్ధకం సమస్య నుంచి బయటపడుతారంట. అంతే కాకుండా, ఇది కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఆకుకూరల్లో పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. ఐన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉండటం వలన దీనిని మీ డైట్‌లో చేర్చుకుంటే, త్వరగా మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
ఓట్స్‌లో బీటా గ్లూకాన్, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తీసుకవడం వలన ఇది కడుపు చికాకును తగ్గించి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చిలకడ దుంపలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ ,కార్బోహైడ్రేట్స్ కూడా ఉండటం వలన దీనిని మీ ఆహారంలో చేర్చుకుంటే ఇది జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది.