జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన జామ పండు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు నిపుణులు.
అలాగే జామ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అందువలన దీనిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
అంతే కాకుండా మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇది వరం అని చెప్పాలి. జామకాయను రోజుకు ఒకటి తినడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అలాగే గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, దీనిని తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలు అస్సలే తినకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
జామ పండు తిన్న తర్వాత వెంటనే ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగకూడదంట. దీని వలన శరీరంలో అనేక సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంటున్నారు నిపుణులు.
అలాగే, జామ పండు తిన్న వెంటనే అరటి పండు తినడం వలన గ్యాస్, కడుపు నొప్పి, తల తిరగడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.
అంతే కాకుండా జామ పండు తిన్న వెంటనే పెరు, మజ్జిగ తాగడం, నెయ్యి తినడం వంటిది చేయకూడదు. దీని వలన కడుపు సమస్యలు అధికం అవుతాయి.