లివర్ ఆరోగ్యం కోసం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే!
samatha
Pic credit - Instagram
శరీరంలో కాలేయం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే కాలేయ ఆరోగ్యం కోసం తప్పకుండా కొన్ని ఆహారాలు తినాలంట. అవి ఏవంటే?
కాఫీ కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే సిర్రోసిస్ అనేది కాలేయ క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. అలాగే ఇది కాలేయ రుగ్మతల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వలన ఇది ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిని, కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలను తగ్గిస్తుంది.
నారింజ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందవలన ప్రతి రోజూ నారింజ పండ్లు తినడం వలన ఇవ కాలేయ వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
అలాగే బ్లూ బెర్రీస్, కాన్బెర్రీస్ లో ఆంథోని సైనిన్లను కలిగి ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఇది కాలేయంలోని కొవ్వును తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది.
బీట్ రూట్ రసంలో సహజ నైట్రేట్స్ , బీటాలైన్‌లు ఉంటాయి. అందువలన కనీసం వారంలో రెండు సార్లు బీట్ రూట్ రసం తాగినా, ఇది కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఇవి కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
సాల్మన్ చేపలు లివర్ హెల్త్‌కు చాలా మంచిది. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు, కాలేయ కొవ్వును తగ్గించి, కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది.