నారింజ పండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!

Samatha

24 November 2025

నారింజ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక నారింజ పండు తినడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు ఆరోగ్య నిపుణులు.

నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన నారింజ తినడం వలన ఇది క్యాన్సర్ కణాలు వృద్ధిని అడ్డుకొని, క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుందంట.

నారింజ పండులో సహజంగా లభించే విటమిన్ సి వలన ఇది కొలొరెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్‌కు వరం అని చెప్పాలి. దీనిని ప్రతి రోజూ తినడ వలన క్యాన్సర్ కణాల సంభావ్యత తగ్గిపోతుందంట.

అదే విధంగా నారింజ పండ్లలో సోడియం ఉండదు. అందువలన దీనిని రక్తపోటు ఉన్నవారు తిన్నా ఎలాంటి నష్టం వాటిల్లదు. అలాగే ఇది రక్తపోటును తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది.

నారింజ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె జబ్బుల సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నారింజ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మేలు చేస్తుంది. దీనిని రోజూ తినడం వలన ఇది ఇన్సులిన్ సెన్సిటివిటినీ తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటీస్‌ను నివారిస్తుంది.

నారింజ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మేలు చేస్తుంది. దీనిని రోజూ తినడం వలన ఇది ఇన్సులిన్ సెన్సిటివిటినీ తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటీస్‌ను నివారిస్తుంది.

నారింజ పండులో విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి, చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది. శరీరానికి మేలు చేస్తుంది.