ఉదయాన్నే బెల్లం, పుట్నాలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
Samatha
24 November 2025
పప్పుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా, ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకూడదు అంటే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి అంటారు.
అయితే పుట్నాలు పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి, పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఇవి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారంట.
ముఖ్యంగా బెల్లంతో కలిపి వీటిని, ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
బెల్లంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం , ఇనుము, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా శరీరానికి మేలు చేసే విటమిన్స్ కూడా ఉంటాయి.
ఇక శనగపప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బీ6, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఇ, పొటాషియం ఉండటమే కాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది.
అందువలన ప్రతి రోజూ ఉదయం ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంట. గుండె సంబంధిత సమస్యలను తగ్గించి, గుండెను రక్షించడంలో ఇది తోడ్పడుతుంది.
బెల్లం, పుట్నాల పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తీసుకోవడం వలన ఇది జీర్ణ సమస్యలను తగ్గించి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
రోజూ బెల్లం, పప్పులు తినే వారిలో రక్తం పెరుగుతుందంట. అంతే కాకుండా ఇది రక్తహీనతను తగ్గించి, శరీరానికి సహజ మెరుపును అందిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.