చలికాలంలో ఉడికించిన గుడ్లు తినడం లేదా.. అయితే ఇవి మిస్సైనట్లే!

Samatha

25 November 2025

ఉడకబెట్టిన కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం వారానికి రెండు కోడి గుడ్లు తినాలని చెబుతుంటారు.

ఇక ముఖ్యంగా చలికాలంలో ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉడికించిన కోడి గుడ్డు తినడం వలన అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

కోడి గుడ్డులో ఆరోగ్య కరమైన కొవ్వులు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన శీతాకాలంలో మీరు దీనిని తినడం వలన ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందంట

అలాగే, వైరల్ వ్యాధులు, ముఖ్యంగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుందంట. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందంట.

ఎగ్స్‌లో విటమిన్, డి,విటమిన్ బీ 12 వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన కోడి గుడ్డు ఈ  సీజన్‌ల తినడం వల్ల ఇవి చలికాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.

చలికాలంలో క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినడం వలన ఇది రోజంతా ఉండే బద్ధకాన్ని తగ్గించడమే కాకుండా. నీరసం , అలసటను దూరం చేస్తుంది.

ఆరోగ్యానికే కాదండోయ్, చర్మ సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తాయంట. ఎవరైతే రోజూ ఒకటి ఉడకబెట్టిన గుడ్డు తింటారో వారి చర్మం శీతాకాలంలో పొడిబారకుండా మృధువుగా ఉంటుందంట.

విటమిన్ డీ లోపంతో బాధపడే వారు ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని, ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.