చలికాలంలో తమిళనాడు స్పెషల్ చికెన్65 బిర్యానీ .. రైతాతో ఇలా తింటే ఆహా అనాల్సిందే!

Samatha

24 November 2025

చికెన్, చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది చికెన్ అంటే చాలు లొట్టలేసుకొని మరి ఎంతో ఇష్టంగా తినేస్తుంటారు.

ఇక చికెన్ 65 బిర్యానీని ఎవ్వరూ వదిలి పెట్టరు. అయితే మీకు చలికాలంలో రుచికరమైన భోజనం చేయాలి అనుకుంటున్నారా? అయితే రైతాతో తమిళనాడు స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇలా చేస్తే అదిరిపోతుందంట.

ఈ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. 500 గ్రాముల బాస్మతి రైస్. 1/4 కప్పు నెయ్యి,1/4 కప్పు కొబ్బరి నూనె, 1/2 కిలో ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చీలు, 2 స్పూన్స్ కారం, వన్ స్పూన్ పసుపు.

2 టీస్పూన్స్ గరం మసాలా, 1/2 కప్పు నీరు, రుచికి సరిపడ ఉప్పు, 1 కప్పు తరిగిన కొత్తిమీర, 1 కప్పు తరిగిన పుదీనా ఆకులు, 3 టేబుల్ స్పూన్స్ పాలు, 1/4 కప్పు పెరుగు, చిటికెడు ఫుడ్ కలర్.

మ్యారినేషన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు : కిలో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా , డీప్ ఫ్రై చేయడానికి నూనె, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం పొడి, స్పూన్ జిలకర్ర పొడి, వన్ టీ స్పూన్ పసుపు.

తయారీ విధానం : ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో చికెన్ వేయాలి. తర్వాత మ్యారినేషన్ కోసం, పెరుగు, అల్లం, మసాలా పొడి ఇలా అన్నిపదార్థాలు వేసుకొని మంచిగా కలుపుకొని, మ్యారినేషన్ కోసం కొంత సేపు పక్కన పెట్టుకోవాలి.

తర్వాత మరో గిన్నె తీసుకొని, అందులో బాస్మతి రైస్ 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి, మరోగిన్నెపెట్టి, బియ్యం ఉడకడానికి సరిపడ నీళ్లు పొసి, నీళ్లు మరిగే వరకు ఉంచాలి. తర్వాత అందులో బియ్యం వేసి, 8 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి.

తర్వాత గ్యాస్ ఆన్ చేసి, మరొక పాత్ర పెట్టి, అందులో, నూనె, నెయ్యి వేసి, ఉల్లిపాయలను వేయించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో మ్యారినేషన్ చేసిన చికెన్, మిరపకాయలు,మసాలా, పూదీనచ కొత్తిమీర, కుంకుమ పువ్వు, పాలు వేసి కలుపుకోవాలి.

ఆ తర్వాత చివరగా నెయ్యి వేసి,పసుపు రంగు ఫుడ్ కలర్ వేసి బిర్యానీ ఉడికించుకోవాలి. తర్వాత బియ్యాన్ని, మిగిలిన ముక్కలను వేయించుకొన్నవి, చికెన్ 65 ముక్కలు వేసుకోవాలి. తర్వాత రైతా వడ్డించి తింటే టేస్ట్ అదిరిపోతుంది.