వీరు క్యాబేజీ అస్సలే తినకూడదు.. తింటే ఎంత ప్రమాదమో!
Samatha
24 November 2025
క్యాబేజీ చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. ముఖ్య క్యాబేజీ పప్పు, క్యాబేజీ పకోడి అంటే చాలా మందికి చెప్పలేనంత ఇష్టం ఉంటుంది.
ఇక దీనిని కొంత మంది ఇష్టంగా తింటే, మరికొంత మంది అసలు క్యాబేజీ తినడానికే ఇష్టపడరు. అయితే దీనిని కొన్నిరకాల వ్యాధులతో బాధపడే వారు అస్సలే తినకూడదంట. వారు ఎవరంటే?
గ్యాస్, ఎసిడీ వంటి సమస్యలు ఉన్నవారు క్యాబేజీకి ఎంత దూరం ఉంటే అంత మంచిదంట. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇది గ్యాస్ సమస్య ఉన్నవారికి మాత్రం ప్రమాదకరం.
అదే విధంగా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా దీనిని అస్సలే తినకూడదంట. ఇందులో ఆక్సలేట్స్, ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.
అదే విధంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అస్సలే క్యాబేజీ తినకూడదంట. ఇందులో గాయిట్రోజెన్లు ఉంటాయి. అందువలన ఇది థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది.
అలాగే కడుపు నొప్పి సమస్యలు ఉన్నవారు కూడా క్యాబేజీ తినకూడదంట. ముఖ్యంగా దీనిని ఎక్కువగా తినడం వలన ఇది కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుందంట.
క్యాబేజీలో విటమిన్ కె ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన రక్తం పలుచబరిచే మందులు వాడే వారు క్యాబేజీ అస్సలే తినకూడదంట. వీలైతే వైద్యుడిని సంప్రదించి తినడం మేలు.
అంతే కాకుండా, అలెర్జీ వంటి సమస్యలు ఉన్నవారు, సీజరిన్ ముందు కూడా క్యాబేజీ అస్సలే తినకూడదు. ఇది గ్యాస్ , కడుపు ఉబ్బరం సమస్యలను పెంచుతుంది.