చలికాలంలో నెయ్యి తినడం మంచిదేనా?

Samatha

24 November 2025

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ ఫుడ్ తినాలి? ఏ ఫుడ్ తినకూడదని ఎక్కువ ఆలోచిస్తుంటారు.

చాలా మందికి చలికాలంలో నెయ్యి తినాలా వద్దా అనే డౌట్ ఉంటుంది. అయితే దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

చలికాలంలో నెయ్యి తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుందంట.

నెయ్యిలో ఉండే ఆరోగ్య కరమైన కొవ్వులు, విటమిన్స్, చర్మానికి పోషణను ఇచ్చి, చర్మం పొడి బారకుండా చేయడమే కాకుండా, చర్మాన్ని రక్షిస్తాయి.

చలికాలంలో నెయ్యి తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో చైన్ ట్రైగ్లిజరైడ్స్  ఎక్కువగా ఉండటం వలన ఇవి మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండటం వలన కనీసం వారానికి రెండు సార్లు నెయ్యి తిన్నా ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుందంట.

అంతే కాకుండా నెయ్యిని మితంగా తీసుకోవడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

బరువు తగ్గాలి అనుకునే వారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున నెయ్యి తినడం వలన త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉన్నదంట. కానీనీ దీని చాలా మితంగా తీసుకోవాలంట.