తలనొప్పిని తరిమికొట్టే అల్లం టీ.. పర్ఫెక్ట్‌గా ఎలా పెట్టాలో తెలుసా?

Samatha

22 march 2026

అల్లం టీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా అల్లం టీ తాగుతుంటారు. కొందరికి అల్లం టీ లేకపోతే ఆ రోజే గడవనట్లు ఉంటుందని చెబుతుంటారు.

అల్లం టీ

ఇంకొంత మంది దగ్గు, జలుబు, తలనొప్పి ఉన్న సమయంలో తప్పకుండా ఒక కప్పు అల్లం టీ తాగుతారు. ఇది తలనొప్పి , గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

దగ్గు జలుబు, తలనొప్పి

అయితే నార్మల్‌గా కాకుండా పర్ ఫెక్ట్, అల్లం టీ ఎలా పెట్టాలో తెలుసా? సరైన విధంగా అల్లం టీ చేస్తే, ఆ టేస్ట్‌కు మీరు ఫిదా అవ్వాల్సిందేనంట. కాగా, దీని గురించి తెలుసుకుందాం.

పర్ఫెక్ట్ టీ

అల్లం టీ కోసం కావాల్సిన పదార్థాలు : అర కప్పు నీరు, అల్లం తురిమినది ,టీ పొడి, చక్కెర సరిపడ, పాలు అర కప్పు.

కావాల్సని పదార్థాలు

తయారీ విధానం : ముందుగా స్టవ్ ఆన్ చేసి, దానిపై పాన్ పెట్టాలి. అందులో అర కప్పు నీళ్లు పోసి, స్టవ్ వెలిగించాలి. నీరు బాగా మరగాలి. అప్పుడు అందులో అల్లం వేయండి.

తయారీ విధానం

తక్కువ మంటపై అల్లం నీరు బాగా మరగాలి. ఇది లేత పసుపు రంగులోకి  మారుతుంది. అప్పుడు టీ పౌడర్, చక్కెర వేసి మంచిగా కలపాలి.

అల్లం నీరు మరగడం

ఇప్పుడు పర్ ఫెక్ట్ డికాషన్ తయారు అవుతుంది. ఇక ఇందులో అర కప్పు పాలు పోసి, రెండు నుంచి మూడు నిమిషాల పాటు తక్కువ మంటపై టీ మరిగేలా చూడండి.

డికాషన్

టీ బాగా మరిగి, మంచి రంగు, మంచి వాసన వస్తుంది. అంతే వేడి వేడి టేస్టీ టేస్టీ అల్లం టీ రెడీ. ఇలా చేసి తాగితే తలనొప్పి పరార్ అవ్వాల్సిందే.

అల్లం టీ రెడీ