నాటు కోడి గుడ్డు తినాలా.. లేక ఫారం కోడి గుడ్లా..

Jyothi Gadda

25 May 2025

గుడ్డు పోష్టికాహారం. ఇందులో ఉండే మాంసకృత్తులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. నాటు కోడి గుడ్డు తినాలా? ఫారం కోడి గుడ్లా..? 

పెద్దవారిలో ప్రోటీన్ లోపం ఏర్పడకూడదంటే.. రోజుకు ఒక గుడ్డును తినాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీరి కండరాలు బలంగా ఉండాలంటే  తరచుగా గుడ్డును తినాలి. 

సాధారణ గుడ్లు నాటుకోడి గుడ్లలో ఒకే పరిమాణంలో పోషకాలు ఉంటాయి. కొన్నిసార్లు గుడ్డు పరిమాణంలో తేడా ఉంటుంది. కానీ, వాటి పోషకాల్లో తేడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

ఫారం కోడిగుడ్డైనా.. నాటుకోడి గుడ్డైనా.. పోషకాలు ఒకే విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏ గుడ్డు తిన్నా.. పోషకాలు పుష్కలంగా అందుతాయి. 

రోజుకు ఒక కోడిగుడ్డును తీసుకుంటే.. బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. అల్పాహారంలో కోడిగుడ్డు తీసుకుంటే మంచిది. తరుచూ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

అందుకే పెరిగే చిన్నారులకు రోజుకు ఓ కోడిగుడ్డును తినిపించాలి. గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. 

మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యానికి మంచిది.

పప్పుల్లో ఉండే ప్రోటీన్లతో పోల్చితే గుడ్డులోని ప్రోటీన్లే చాలా తొందరగా జీర్ణమవుతాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. కాబట్టి ఎదిగే పిల్లలకు మంచిది.