PCOD ని తరిమి కొట్టే నల్ల నువ్వుల లడ్డు.. ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలంటే?

Samatha

24 march 2026

ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలు PCOD బారిన పడుతున్నారు. తీసుకుంటున్న ఆహారం , జీవన శైలి దీనికి ముఖ్య కారణం. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

PCOD

అయితే పీసీఓడీ సమస్యను ఒక లడ్డూతో తరిమికొట్ట వచ్చు అంటున్నారు నిపుణులు. అదే నల్ల నువ్వుల లడ్డు. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

లడ్డూ

నల్ల నువ్వుల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : నెయ్యి వన్ టీ స్పూన్, నల్ల నువ్వులు అరకప్పు, అవిసె గింజలు పావు కప్పు, వాల్ నట్స్ అర కప్పు, గుమ్మడి గింజలు 30 గ్రాములు, ఖర్జూర 20 వరకు.

పదార్థాలు

లడ్డూ తయారీ విధానం : దీని కోసం ముందుగా పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి, అవిసె గింజలు, వాల్ నట్స్, నల్ల నువ్వులు, గుమ్మడి గింజలు అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి.

లడ్డూ తయారీ

తర్వాత వాటిని వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్లీ పాన్ పెట్టి, స్పూన్ నెయ్యి వేసి, అందులో ఖర్జూరాలు వేసి బాగా వేయించుకోవాలి. అంతే.

మిశ్రమం

ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని, అందులో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఖర్జూరాలు కూడా వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.

మిక్సీ పట్టుకోవడం

ఈ మిశ్రమం ముద్దగా చేయడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. కాసేపు గాలికి పెట్టాలి.

గాలికి పెట్టడం

అంతే టేస్టీ టేస్టీ నల్ల నువ్వుల లడ్డూ రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పీసీఓడీ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి.

నల్ల నువ్వుల లడ్డూ