ధర్మేంద్ర రాజకీయ ప్రస్థానం.. ఆసక్తికర వివరాలు ఇదిగో..
Samatha
24 November 2025
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (86) నవంబర్ 24 మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈయన ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.
బాలీవుడ్ హిట్ మ్యాన్‌గా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి, అభిమానుల మనసు గెలుచుకున్నారు.
అయితే నటనా పరంగానే కాదు, ధర్మేంద్ర రాజకీయపరంగా కూడా ప్రజల మనసు గెలుచుకున్నారు. ఈయనకు రాజకీయాలతో ప్రత్యేక సంబంధం ఉంది.
ధర్మేంద్ర 2024లో భారతీయ జనతా పార్టీ స్వింగ్ ఇండియా ప్రచారంతో, ప్రేరణ పొంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన తన శత్రుఘ్న సిన్హా, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ . కే అద్వానీ, కలవడంతో ఈయన రాజకీయ జీవితంలో తొలి అడుగు ప్రారంభమైంది.
తర్వాత ఈయనకు బీజేపీ పార్టీ, రాజస్థాన్‌లోని బికనీర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎంపీ టికెట్ ఇచ్చి, అభ్యర్థిగా నామినేట్ చేసింది. అలా ఈయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.
ఈ సమయంలో ధర్మేంద్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంతో, దాదాపు 60,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రామేశ్వర్ లాల్ దూడిపై విజయం సాధించారు.
భారీ మెజారిటీతో బికనీర్ లోక్ సభ ఎన్నికల్లో గెలిచి, పార్లమెంట్‌లోకి అడుగు పెట్టాడు, ఈ స్టార్ హీరో. కానీ ఈయనకు రాజకీయం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.
ధర్మేంద్ర రాజకీయాల కంటే సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. రాజకీయాలలో కంటే, ఈయన సినిమాల పరంగానే చాలా సక్సెస్ అయ్యారు. అలా రాజకీయాలకు దూరం అయ్యారు.