ఈ పాపను గుర్తుపట్టారా.. వరసగా ఫ్లాప్స్.. గ్లామర్‌తో ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న బ్యూటీ
samatha
16 MAY 2025
Credit: Instagram
నీలి రంగు చీరలో ఉన్న చిన్న పాపను గుర్తుపట్టారా? వరసగా ఫ్లాప్స్ అందుకుంటున్నా.. తన గ్లామర్‌తో ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
హీరోయిన్‌గా తన సత్తా చాటడమే కాకుండా.. ఐటమ్ సాంగ్స్‌లో కూడా తన అందచందాలు, డ్యాన్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఇంతకీ ఈ బ్యూటీ ఎవరా? అనేగా మీ ఆలోచనే..టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల. అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అందం, అభనయం ఈ ముద్దుగుమ్మ సొంతం. పెళ్లిసందD సినిమాతో హీరోన్‌గా తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టింది.మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఎవ్వరూ ఊహించని విధంగా వరసగా తొమ్మిది సినిమాలకు సైన్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది
దీంతో ఈ ముద్దుగుమ్మ తెలుగులో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, బాలీవుడ్ వైపు కన్నేసింది.బాలీవుడ్‌లో ఆషికీ3 సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.
ఇక తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన చిన్ననాటి ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీలి రంగు చీరలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన వారందరూ.. శ్రీలీల చాలా క్యూట్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.