బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొడుతున్న చిట్టి..క్రేజీ ఫొటోస్

samatha 

16 MAY 2025

Credit: Instagram

అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

జాతిరత్నాలు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత చాలా సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయనే చెప్పాలి. దీంతో చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి అంతగా అదృష్టం కలిసిరాలేదు.

అనుకున్నంత రేంజ్‌లో ఈ బ్యూటీ తెలుగులో ఆఫర్స్ అందుకో లేకపోయింది. ముఖ్యంగా చాలా వరకు స్టార్ హారోల సినిమాల్లోనటించే ఛాన్స్ మాత్రం రాలేదు.

దీంతో ఈ బ్యూటీ వచ్చిన ఏ సినిమాలైనా సరే వదులుకోకుండా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక ఈ అమ్మడు 28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది

ఆమె హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబనికి చెందినది. అయితే  సినిమాపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది.

తాజాగా ఈ బ్యూటీ నల్లటి బ్లౌజ్‌తో తెల్లటి ఎంబ్రాయిడరీ ,దానికి సరిపోయే నల్లటి స్కర్ట్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో తన గ్లామర్‌తో చంపేస్తుంది చిన్నది.