క్యూట్ క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న మృణాళిని రవి 

Rajeev 

30  march 2026

గద్దల కొండా గణేష్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ మృణాళిని రవి. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. 

ఈ చిన్నది 2019లో విడుదలైన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో వరుసగా ఆఫర్స్ అందుకుంది 

హీరోయిన్ అవ్వక ముందు ఈ చిన్నది సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ మరియు టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది.

ఈ బ్యూటీ గద్దలకొండ గణేష్ చిత్రంలో బుజ్జమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాత్రకు ఆమె SIIMA అవార్డు ఉత్తమ సహాయ నటి నామినేషన్ అందుకుంది.

చాంపియన్ (2019, తమిళం), ఎనిమీ, జాంగో, కోబ్రా, మామా మశ్చీంద్ర  సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది అందాల భామ మృణాళిని రవి

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు నెటిజన్స్ ను కట్టిపడేస్తున్నాయి. ఈ అమ్మడి ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.