బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దీంతో పసిడి ప్రియులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆభరణాలు కొనుగోలు చేయాలంటే మళ్ళీ లక్షలు పెట్టాలా అని ఆందోళనలో పడ్డారు.
ముఖ్యంగా గతవారం భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్ళీ పెరగడానికి ప్రధాన కారణం అమెరికా క్రెడిట్ రేటింగ్ భారీగా తగ్గించడం అని చెప్పవచ్చు అంటున్నారు మార్కెట్ నిపుణులు.
ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అమెరికా రేటింగును తగ్గించింది. దీంతో అక్కడి స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవడం ప్రారంభించాయి.
ఈ దెబ్బతో అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు మళ్ళీ బంగారం వైపు తరలి వెళ్తున్నారు. దీంతో బంగారం ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగి భారీగా పెరగడం ప్రారంభించాయి.
బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధర డాలర్ విలువ పడిపోయినప్పుడల్లా భారీగా పెరుగుతుంది.
అదేవిధంగా స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు కూడా బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగారం ధరలు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లో ఒక ట్రాయ్ ఔన్స్ ధర 3300 డాలర్ల సమీపంలో ఉంది. గతంలో ఇది 3150 వరకు పడిపోయింది.
గడిచిన రెండు రోజుల్లోనే బంగారం ధర 150 డాలర్లు పెరిగింది. దీంతో అటు రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి.
ఫలితంగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదిలా ఉంటే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.