అక్షయ తృతీమ రోజునా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే !

samatha 

21 April 2025

Credit: Instagram

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సారి అక్షయతృతీయ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే? ఆరోజున అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి.

ఈ సారి అక్షయతృతీయలో గజకేసరి రాజయోగం, లక్ష్మీ నారాయణ యోగం ,సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడనుంది. దీంతో ఇది ఐదు రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుంది.

వృషభ రాశి  వారికి అక్షయ తృతీయ చాలా శుభప్రదం. ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి.

ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

వృశ్చిక రాశి  వారు చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తుల రాశి వారికి అక్షయ తృతీయ చాలా శుభ ప్రదమైనది. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి.

మకర రాశి  వారికి అక్షయ తృతీయ రోజున ఆర్థికంగా బాగుంటుంది. వీరికి లక్ష్మీ దేవిచ శని దేవుని ప్రత్యేక ఆశిస్సుల వలన కలిసి వస్తుంది. ఆస్తులు పెరుగుతాయి.

కుంభ రాశి  వారు చాలా ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి.