చాణక్య నీతి : మీరు పుట్టక ముందే నిర్ణయించబడేవి ఇవే..మార్చలేరు!

Samatha

20 july  2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గొప్ప పండితుడు అపర మేధావి, అన్ని అంశాలపై పట్టు ఉన్న వ్యక్తి.

అయితే ఒక వ్యక్తి జీవించే క్రమంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని పనులు ఫలితాలను చూపించవు. అయితే దీని గురించి చాణక్యుడు తెలియజేశాడు.

ఒక వ్యక్తి ఎంత శక్తివంతుడైనా సరే, అతను తన విధిలో రాసిన వాటిని మార్చలేడు. ఒక వ్యక్తి పుట్టక ముందే కొన్ని  విషయాలు నిర్ణయించబడతాయని తెలిపారు.

చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి వయస్సు లేదా అతను ఎంతకాలం జీవిస్తాడనేది అతని పుట్టుకకు ముందే నిర్ణయించబడుతుందంట.

చాణక్య నీతి ప్రకారం మీరు ఈ జన్మలో చేసే కొన్ని పనులు మీ గత జన్మలోని విధి ఆధారంగా ఉంటాయి. వాటిని మీరు మార్చలేరని చెబుతున్నాడు.

అలాగే,ఈ జన్మలో మీ ఆర్థిక పరిస్థితి, మీరు ఎంత డబ్బు సంపాదిస్తారు అనేది మీకు గత జన్మలోనే రాసి ఉంటుందంట. దాని ప్రకారమే మీ ఆర్థిక పరిస్థితి ఉంటుందంట.

ఆచార్య చాణక్యుడు  మీరు జీవితంలో ఎంత విద్యను పొందుతారో అనే విషయం కూడా మీరు పుట్టకముందే నిర్ణయించబడుతుందని చెబుతున్నాడు.

అంతే కాకుండా మీ మరణం కూడా మీరు పుట్టక ముందే నిర్ణయించబడుతుంది. మీరు ఎప్పుడు చనిపోతారో కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడుతుందంట.