ఇటీవలి కాలంలో గుండెపోటుతో అకస్మాత్తుగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. తాజాగా వివాహ వేదిక మీదే గుండెపోటు బారినపడి ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. నంద్యాల జిల్లా కృష్ణ గిరి మండలం పెనుమడ గ్రామంలోని జరిగిన వివాహా వేడుకల్లో స్టేజ్ పైనే యువకుడు కుప్పకూలాడు.