వర్షకాలంలో సందర్శించడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ హిల్ స్టేషన్స్ ఇవే!
samatha
20 JUN 2025
Credit: Instagram
వర్షకాలం వచ్చిందంటే చాలు వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోతుంది. అందుకే చాలా మంది ఈ సీజన్‌లో టూర్ వెళ్లడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు.
మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాలు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వంటి ప్రదేశాలకు వెళ్లడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాగా, వర్షకాలంలో చూడటానికి బడ్జెట్ ఫ్రెండ్లీ హిల్ స్టేషన్స్ గురించి తెలుసుకుందాం.
పశ్చిమ కనుమలలో పొగమంచుతో ఉండే సరసను చూడటానికి వెళ్లాలి అనుకునే వారు కొడైకెనాల్ బెస్ట్ ప్లేస్. దీనిని హిల్ స్టేషన్స్ యువరాణి అని కూడా పిలుస్తారు. అద్భుతమైన ప్రదేశం.
తొలకరి చినుకుల్లో మేఘాలు, టీ ఎస్టేట్స్ మధ్య ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి కేరళలోని మున్నార్ బెస్ట్ ప్లేస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేసెస్‌లో ఇదొక్కటి.
అద్భుతమైన హిల్ స్టేషన్‌లో కర్ణాటకలోని కూర్గ్ ఒకటి. ఇక్కడి కాఫీతోటలు, అందమైన పచ్చటి ప్రకృతి, మేఘావృతమైన ఆకాశం,పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటుంది.
వర్షంలో తడుస్తూ, జలపాతాల్లో ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి కర్ణాటకలోని చిక్కమగళూరు బెస్ట్ ప్లేస్. ఇది వర్షకాలం ట్రిప్‌కు బెస్ట్ ప్లేస్. ఆనందంగా ఎంజాయ్ చేయోచ్చు.
అరకులోయ అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. గిరిజన నృత్యాలు, ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, అందమైన పూలతోటలకు నిలయమైన అరకు ట్రిప్‌కు బెస్ట్ ప్లేస్.
వర్షకాలంలో చూడటానికి అందంగా కనిపించే అద్భుతమైన ప్రదేశాల్లో చిరపుంజీ మేఘాలయ ఒకటి. ఇక్కడ సెవెన్ సిస్టర్స్ జలపాతం చూడటానికి బాగుంటుంది.