శీతాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ ప్లేసెస్ ఇవే!
20 october 2025
Samatha
శీతాకాలం వచ్చిందంటే చాలు వాతావరణం చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. దీంతో చాలా మంది టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.
కాగా, ఇప్పుడు మనం శీతాకాలంలో దక్షిణ భారతదేశంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఏవో చూద్దాం.
పశ్చిమ కనుమలలో ఉన్న అందమైన ప్రదేశాల్లో అగుంబే ఒకటి. ఇక్కడ అందమైన మంచు కొండలు, దట్టమైన వర్షారణ్యాలు, సాహస ప్రియులకు ట్రెక్కింగ్ ఉంటాయి.
ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో వారు ఆనందంగా, పచ్చని చెట్లు, తోటల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకుంటారో వారు, కర్ణాటకలో ఉన్న అగుంబేకు వెళ్లడం మంచిదంట.
తమిళనాడు, కోయంబత్తూర్ సమీపంలో ఉన్న పొల్లాంచి అద్భుతమైన ప్రదేశం, ఇక్కడ అనమలై కొండలు, కొబ్బరి తోటలు, సుందరమైన ప్రకృతి, ఇవన్నీ పర్యాటకుల
కేరళలని అతి పెద్ద జలపాతానికి నిలయంగా ఉన్న అతిరపిల్లిని దక్షిణ భారతదేశంలోని భారతదేశం నయాగరా అని పిలుస్తారు. ఇక్కడి కొండలు, ఉద్యానవనాలు అద్భుతంగా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగి, దక్షిణ భారత దేశంలో శీతాకాలంలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశం, ఇక్కడి కాఫీ తోటలు , పొగమంచుతో కూడిన సూర్యోదయాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
ఆధ్యాత్మిక సుందరమైన ప్రదేశాల్లో గోకర్ణ ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడి మహాబలేశ్వరం ఆలయం ఏడాది పొడవున, భక్తులతో కిట కిటలాడుతుంటుంది