అద్భుతమైన ప్రదేశాలు.. వెళితే ఆనందమే ఆనందం..

01  october 2025

Samatha

స్నేహితులతో జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? వర్షపు చినుకుల్లో తడుస్తూ అందమైన ప్రాంతాలు చుట్టేయ్యాలనుకుంటారు.

స్నేహితులతో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే వర్షాకాలలో చూడటానికి అద్భుతమైన ప్రదేశాలు ఏవీ,  అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వర్షాకాలంలో మున్నార్ వాతావరణం ఓ అద్భుతం అనే చెప్పాలి. మంచుతో కప్పబడిన కొండలు, ఉత్సాహభరితమైన పచ్చని టీ తోటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

వర్షకాలంలో ఎంజాయ్ చేయడానికి ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఇప్పుడు పర్యటకులు చాలా తక్కువగా ఉంటారు.

కర్ణాటకలోని అందమైన ప్రదేశాల్లో కూర్గ్ ఒకటి. వర్షాకాలంలో కూర్గ్‌లోని పచ్చని కాఫీ ఎస్టేట్‌లు, అటవీ దారులు అద్భుతంగా ఉంటాయి. 

రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్న చిరపుంజీ వర్షాకాలంలో ఒక అద్భుత ప్రదేశంగా మారుతుంది. ఒంటరిగా ప్రయాణికులు లివింగ్ రూట్ బ్రిడ్జిలకు వెళ్లి ట్రెక్కింగ్ చేయవచ్చు

సాహసోపేతమైన ఒంటరి ప్రయాణికులకు అద్బుతమైన ప్రదేశం తవాంగ్. వర్షాకాలంలో హిమాలయాల అందాలను చూడటానికి ఇది బెస్ట్ ప్లేస్.

అతి దగ్గరలో అంటే ఆంధ్రప్రదేశ్‌లోని అరకు స్నేహితులు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.