దసరా రోజు పాలపిట్టను చూడటం వెనకున్న రహస్యం ఏంటో తెలుసా?

28 September 2025

Samatha

దసరా పండుగ వచ్చేస్తోంది. తెలుగు ప్రజలు ఘనంగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో అక్టోబర్ 2న ఈ పండుగను జరుపుకోనున్నారు.

ఇక దసరా అంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది జమ్మి చెట్టు, పాలపిట్ట. ముఖ్యంగా ఈ రోజు పాలపిట్టను చూడటం చాలా శుభప్రదం అంటారు.

అయితే అసలు దసరాకు పాలపిట్టకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దసరా రోజు పాలపిట్టను చూడటం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం.

ఇక దసరా రోజు పాలపిట్టను చూడాలని చాలా మంది చెబుతుంటారు. ఈరోజు పాలపిట్టను చూడటం చాలు శుభదాయకం. అయితే ఇలా పాలపిట్టను చూడటం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

ముఖ్యంగా రామాయణంలో పాలపిట్ట గురించి ఓ కథ ఉంది. రాముడు రావణుడిపై యుద్ధానికి వెళ్లేటప్పుడు పాలపిట్టను చూసి వెళ్తాడంట.

అప్పుడు రాముడు రావణుడిని ఓడించి విజయం సాధించాడు. అందుకే దసరా రోజు పాలపిట్టను చూస్తే చాలా మంచి జరుగుతుంది, విజయం వరిస్తుందని చెబుతుంటారు.

అంతే కాకుండా, ఈ రోజు పాలపిట్టను చూడటం వలన ఇంట్లో ఆనందం వెల్లి విరుస్తుందంట. ఎవరైతే చాలా రోజుల నుంచి కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటారో అవన్నీ నెరవేరుతాయంట.

ఇంటా, బయట సానుకూల వాతావరణం, మానసికప్రశాంతత వంటివి కలుగుతాయంట. అందుకే తప్పకుండా దసరా రోజు పాలపిట్ట చూడాలంటారు.