చాణక్య నీతి : ఎలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడో తెలుసా?
28 September 2025
Samatha
ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడు,పండితుడు , అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.
ఈయన మానవాళి సంక్షేమం కోసం, ఎన్నో విషయాలు తెలియజేశాడు. అవి నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి..
ఇక చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, ఎన్నో గొప్ప విషయాల గురించి తెలిపిన విషయం తెలిసిందే, అలాగే ఆయన ఎలాంటి వ్యక్తులు జీవితంలో విజయం సాధించరో తెలిపారు. వారెవరంటే?
ఎవరైతే ప్రతి విషయంలో ఎక్కువగా భయపడతారో వారు జీవితంలో విజయం సాధించరంట. మీరు జీవితంలో విజయం సాధించాలంటే భయం వదిలిపెట్టాలంటున్నాడు చాణక్యుడు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఏదైనా పని చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చింతించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేడంట.
సోమరితనం అనేది ఒక వ్యక్తిలో ఉండే అతి చెడ్డ అలవాటు. అందువలన ఎవరైతే ఎప్పుడూ సోమరిగా ఉంటారో వారు సక్సెస్ అవ్వలేరు.
అహంకారం జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే జీవితంలో విజయం సాధించాలి అనుకునే వ్యక్తికి అస్సలే అహంకారం ఉండకూడదంట.