ఇంట్లో నెమలి ఈక ఎక్కడ ఉంటే సంపద వర్షం కురుస్తుందో తెలుసా?

Samatha

1 november 2025

నెమలి ఈకలు వాస్తు పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి. అంతే కాకుండా,  వీటివలన ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది.

అందుకే చాలా మంది వీటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే ఇవి ఇంటిలోపల ఏ ప్రదేశంలో ఉంటే ఆర్థికంగా, ఆరోగ్య పరంగ కలిసి వస్తుందో చూద్దాం.

ఇంట్లో బెడ్ రూమ్‌లో నెమలి ఈకను పెట్టడం చాలా మంచిది. దీని వలన అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడే ఛాన్స్ ఉంది.

ఎవరైతే బెడ్ రూమ్‌లో నెమలి ఈకను పెడతారో, వారు అప్పుల సమస్యల నుంచి బయటపడటమే కాకుండా, అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయంట.

ఇక వ్యాపారాల్లో నష్టాలు చూస్తున్నవారు, నెమలి ఈకను తమ వ్యాపారం సంస్థలో ఆగ్నేయ దిశలో పెట్టాలంట. ఇది చాలా శుభప్రదం. దీని వలన వ్యాపారంలో అత్యధికంగా లాభాలు వస్తాయి.

ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశించాలి అనుకుంటే, మీరు మీ లివింగ్ రూమ్‌లో నెమలి ఈకలను పెట్టుకోవడం మంచిదంట. దీని వలన ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది.

ఇక మీ ఇంటికి ఈశాన్య దిశలో నెమలి ఈకను పెట్టడ వలన మీ జీవితంలోని సమస్యల క్రమంగా తగ్గిపోతాయంట. ఇంటా బయట సంతోషకర వాతావరణం కలుగుతుంది.

ఇక ఎవరి ఇంట్లోనైతే, శ్రీ కృష్ణుడి విగ్రహంతో పాటు నెమలి ఈకను ఇంటిలోపెట్టుకుంటారో, వారు చిక్కుకపోయిన డబ్బును తిరిగి పొందుతారంట.