మరణించిన వారి ఫోటో పర్సులో ఉంచుకోవడం శుభమా లేక అశుభమా? తెలుసా 

10 June 2025

Pic credit: Google 

TV9 Telugu

మనం కొంతమందితో  మంచి అనుబంధం కలిగి ఉంటాం. మనకు అత్యంత ఆప్తులు, ఇష్టమైన వారు మరణించిన తర్వాత కూడా వారిని మరచిపోలేము.

వారి జ్ఞాపకార్థం కొంత మంది ఆ మరణించిన వ్యక్తి ఫోటోను తమ పర్సులో పెట్టుకుంటారు.

అయితే ఇలా చనిపోయిన వ్యక్తుల ఫోటోలను మన పర్సుల్లో ఉంచుకోవాలా వద్దా అనేది వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం మరణించిన వ్యక్తి ఫోటోను మన పర్సులో ఉంచుకోకూడదు. చనిపోయిన వ్యక్తి ఫోటో పర్సులోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు.

పర్స్ మన పురోగతికి సంబంధించినదని కూడా నమ్మకం. కనుక చనిపోయిన వ్యక్తి ఫోటో ఉంచుకోవడం పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.

మరణించిన వ్యక్తికి శాంతి కలిగేలా.. వారి ఆత్మ తృప్తి పడేలా చేయడం పై దృష్టి పెట్టాలి.

డబ్బులను, అవసరమైన వస్తువులను పెట్టుకోవడానికి పర్స్ అవసరం. అంతేకాని మృతుల ఫోటోను పర్సులో పెట్టుకుంటే అటువంటి వ్యక్తులు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

పురాణాల ప్రకారం, లక్ష్మీ దేవి డబ్బు, అవసరమైన వస్తువులు ఉన్న పర్సులలో నివసిస్తుంది. కనుక మరణించిన వ్యక్తి ఫోటోను పర్స్ లో పెట్టడం లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వాస్తు, జ్యోతిషశాస్త్రం ఆధారంగా రూపొందించబడింది. TV9 తెలుగు దీనిని నిర్ధారించలేదు.