06 June 2025
Pic credit: Pinterest
TV9 Telugu
శారీరక, మానసిక ఆరోగ్యానికి సరైన నిద్ర కూడా చాలా అవసరం. కనుక తినే ఆహారాలలో కొన్నింటిని చేర్చుకోండి.. రాత్రి సమయం మంచి నిద్ర పొందండి.
బాదంలో మెలటోనిన్ ఉంటుంది. మెలటోనిన్ మీ నిద్ర సరళిని మెరుగుపరుస్తుంది. ఇది మీకు మంచి రాత్రి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్‌లో సెరోటోనిన్ ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. మీకు మంచి రాత్రి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.
ఈ పండులో పొటాషియం, ఫోలేట్ , విటమిన్లు సిలతో పాటు విటమిన్ ఇ ఉన్నాయి. ఇవి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
చెర్రీస్‌లో నిద్రను ప్రోత్సహించే మెలటోనిన్ అనే హార్మోన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల రాత్రి సమయంలో బాగా నిద్రపోవచ్చు.
వీటిల్లో ట్రిప్టోఫాన్, మెగ్నీషియం , జింక్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజలు మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.
మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉండే అరటిపండ్లను రాత్రి సమయంలో తినడం వల్ల కూడా బాగా నిద్రపోవచ్చు.
పాలలో ట్రిప్టోఫాన్ . మెలటోనిన్ ఉంటాయి. కనుక వేడి పాలను తాగడం వలన రాత్రి నిద్ర లేమి సమస్యని తీర్చి.. నిద్రను మెరుగుపరుస్తాయి.