సీఎం యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు, ఫ్యామిలీ నేపధ్యం ఏమిటంటే
04 June 2025
Pic credit: Google
TV9 Telugu
సీఎం యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలోని పంచూర్ గ్రామంలో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్‌సింగ్ బిస్త్. తండ్రి పేరు ఆనంద్ సింగ్ బిస్త్, తల్లి పేరు సావిత్రి దేవి.
ఆయన ప్రాథమిక విద్యను పౌరిలో జరిగింది. ఆ తరువాత ఉత్తరాఖండ్ శ్రీనగర్‌లో ఉన్న హెచ్‌ఎన్‌బీ గర్‌వాల్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందాడు.
యోగి ఆదిత్యనాథ్ సన్యాసం పై ఆకర్షితులయ్యారు. చాలా చిన్న వయసులోనే ఇల్లు వదిలి 22 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించారు.
సన్యాసం తీసుకున్న తర్వాత, సిఎం యోగి తన పుట్టినరోజును ఎప్పుడూ జరుపుకోలేదు
గోరఖ్‌నాథ్ మఠాధిపతి ఆదిత్యానాథ్ అస్తమయంతో ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ కేవలం 26 సంవత్సరాల వయసులో ఎంపీ అయ్యారు. 1998లో తొలిసారిగా గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన అతిపిన్న వయస్కుడుగా చరిత్ర సృష్టించారు
ఏడుగురు తోబుట్టువులలో సిఎం యోగి ఐదవవాడు. యోగి సోదరుడు భారతీయ సైన్యంలో జవాన్. సోదరి, బావగారు టీ దుకాణం నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.