04 June 2025
Pic credit: Google
TV9 Telugu
వాము ఆకులలో జీర్ణశక్తిని మెరుగుపరచే ఔషధ గుణాలున్నాయి. వాంతులు, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలకు ఇవి ఉపశమనం ఇస్తాయి.
వాము ఆకులు శ్వాసనాళాల్ని శుభ్ర పరుస్తాయి. దగ్గు, అస్తమా, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలకు ఉష్ణతను ఇచ్చి ఉపశమనం కలిగిస్తాయి.
వాము ఆకుల కషాయాన్ని తయారు చేసి .. ఆ కషాయాన్ని నొప్పి ఉన్న ప్రదేశానికి పూస్తే వాపు, మగత, కీళ్ల నొప్పికి ఉపశమనం లభిస్తుంది.
వాము ఆకులలో యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నాయి. వాము ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని త్రాగడం వల్ల శరీరంలోని హానికరమైన బాక్టీరియాలు తొలగిపోతాయి.
వాము ఆకుల రసం చర్మం సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. తేలు కరచిన చోట, దోమలు కుట్టిన చోట ..లేదా చర్మంపై దద్దుర్లున్న చోట వాము ఆకుల రసాన్ని అప్లై చేస్తే ఇరిటేషన్, వాపు తగ్గుతుంది.
వాము ఆకుల వాసన నాడీ వ్యవస్థను శాంతపరిచేలా పనిచేస్తుంది. ఇది మైగ్రెయిన్, తలనొప్పి వంటి సమస్యలు ఉంటే వాము ఆకులను రుద్దడం ద్వారా తలనొప్పిని తగ్గించవచ్చు
వాము ఆకును నమిలినా, వాము నీటిని తాగినా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకులను నీటిలో మరిగించి టీలా తాగవచ్చు. ఆకులను చట్నీగా చేసుకోవచ్చు.
వాము ఆకులను మితంగా వాడాలి. ఎక్కువగా వాడితే అసిడిటీ లేదా ఇతర అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.