బల్లి మిమ్మల్ని కరిస్తే ఏమవుతుంది?

30 May 2025

Pic credit: Google

TV9 Telugu

దాదాపు ప్రతి ఇంట్లో బల్లులు కనిపిస్తాయి. చాలా మంది బల్లులను చూసి భయపడతారు

వాటిలో విషం ఉంటుందని నమ్ముతారు. బల్లి కరిస్తే ప్రాణాలు పోతాయేమో అని అనుకుంటారు.  

కొన్ని రకాల బల్లులు చాలా విషపూరితమైనప్పటికీ అవి అడవుల్లో చాలా అరుదుగా ఉంటాయి. ఇళ్లలో జీవించే బల్లులు మాత్రం విషపూరితమైనవి కావు

కనుక ఇంట్లో ఉండే బల్లి కరిస్తే విషం ఉండదు. బల్లి కరిస్తే గాయం , ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు.

బల్లి కాటు ఒక వ్యక్తిని చంపదు, కానీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ  ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రమైన నొప్పి, మంట, దురద, వాపు , జ్వరం వస్తుంది.

అదనంగా, వికారం, వాంతులు వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు.

బల్లి మలంలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. కనుక పొరపాటున ఇది చర్మంపై పడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి

బల్లి కొరికిన తర్వాత ఆ ప్రదేశాన్ని సబ్బుతో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత యాంటీ సెప్టిక్ మందులను బల్లి కొరికిన ప్రదేశంలో అప్లై చేసి కొంచెం మసాజ్ చేయాలి