లక్ ని తెచ్చే తాబేలు ఉంగరం.. ఏ వెలికి ధరించడం శుభప్రదం అంటే.. 

28 May 2025

Pic credit: Google

TV9 Telugu

వేద జ్యోతిషశాస్త్రంలో మనుషుల జీవితంలోని అన్ని సమస్యలను తొలగించగల అనేక పరిష్కారాలు ఉన్నాయి. అలాంటి ఒక నివారణ తాబేలు ఉంగరానికి సంబంధించినది కూడా.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రకారం తాబేలు ఉంగరం ధరించడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయని .. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.

తాబేలు ఉంగరం ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. మీరు వాటిని విస్మరిస్తే.. తాబేలు ఉంగరం ధరించడం వలన కలిగే ప్రభావం విరుద్ధంగా ఉండవచ్చు.

తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. 

తాబేలు ఉంగరాన్ని కుడి చేతి మధ్య వేలుకు ధరించాలి. ఈ వేలు శనిశ్వరుడి, లక్ష్మీ దేవి ఇద్దరితోనూ సంబంధం కలిగి ఉంటుంది. ఇది సానుకూల ఫలితాలను తెస్తుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం వెండితో చేసిన తాబేలు ఉంగరం మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది. మరే ఇతర మెటల్ రింగ్ ప్రయోజనకరం కాదు.

తాబేలు ఉంగరం ధరించేటప్పుడు, తాబేలు ముఖం మీకు ఎదురుగా ఉండ కూడదని గుర్తుంచుకోండి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. సంపదను తెస్తుంది.

తాబేలు ఉంగరాన్ని ధరించే ముందు దానిని గంగా జలం లేదా పచ్చి పాలతో శుభ్రం చేయాలి. తరువాత దానిని లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి, నెయ్యి దీపం వెలిగించి 'శ్రీ సూక్త' పారాయణం చేయండి. ఆ తర్వాతే ఉంగరం ధరించండి.