ఇంటి లోపల లేదా ఇంటి ముందు అరటి చెట్టును నాటడం శుభమా లేదా అశుభమా?

21 May 2025

Pic credit: Google

TV9 Telugu

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి, మనీ ప్లాంట్, వెదురు చెట్టు వంటి మొక్కలను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలు ఇంటికి సానుకూలతను తెస్తాయి. ఇంటి వాస్తు దోషాలను తొలగిస్తాయి.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అరటి చెట్టును ఇంటి లోపల లేదా బయట నాటాలా? ఇలా చేయడం శుభమా లేక అశుభమా అని తెలుసుకోండి.  

అరటి చెట్టు పెంచుకోవడం గురించి ప్రజలకు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. కొందరు దీనిని శుభప్రదంగా భావిస్తారు, మరికొందరు దీనిని అశుభంగా భావిస్తారు.

పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు అరటి చెట్లలో నివసిస్తాడని నమ్మకం. కనుక ఈ చెట్టును పెంచుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. అయితే దీనిని ఇంటి వెనుక నాటాలి.

పొరపాటున కూడా అరటి చెట్టును ఇంటి ముందు ఎప్పుడూ పెంచుకోకూడదు. దీనివల్ల ఇంట్లోకి పేదరికం రావచ్చు. కనుక అరటి చెట్టుని ఇంటి వెనుక ఆవరణలో పెంచుకోవాలి.

అరటి చెట్టు నాటడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది. ఇది ఆనందం, శ్రేయస్సును కూడా పెరుగుతుంది.

అరటి చెట్టులో నవ గ్రహాల్లో బృహస్పతి నివసిస్తున్నాడని నమ్ముతారు. దేవ గురువుకి చిహ్నం అయిన అరటి చెట్టుని పెంచుకోవడం వలన జాతకంలో బృహస్పతి గ్రహం బలపడుతుంది.

అయితే కొంతమంది అరటి చెట్టును ఇంట్లో పెంచుకోవడం అశుభమని భావిస్తారు. ఎందుకంటే ఈ చెట్టు ఇంట్లోకి పేదరికాన్ని కలిగిస్తుందని నమ్మకం.

అంతేకాదు అరటి చెట్టు ఇంటి సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు. అయితే ఇది వ్యక్తి వ్యక్తిగత నమ్మకాలు, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.

కనుక కుండీలో అరటి మొక్కను పెంచినట్లయితే, దానిని ఇంటి వెనుక భాగంలో ఉంచండి. ఇక్కడ ఇచ్చిన సమాచారం వాస్తు, జ్యోతిషశాస్త్రం ఆధారంగా ఇవ్వబడింది.  TV9 తెలుగు దీనిని నిర్ధారించలేదు