ప్రతిరోజు ఇంటి ముందుకు ఆవు రావడం దేనిని సూచిస్తుంది?

20 May 2025

Pic credit: Pexels

TV9 Telugu

సనాతన ధర్మంలో ఆవును తల్లిగా భావిస్తారు. భారతదేశంలో ఆవులను గోమాతగా దైవంగా భావించి పూజిస్తారు.

హిందూ మతంలో ఆవును చాలా పవిత్రంగా మరియు శుభప్రదంగా భావిస్తారు. ఆవును పూజిస్తే, 33 కోట్ల దేవుళ్లు, దేవతలు పూజించినట్లు అని నమ్మకం.

ఆవును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. అయితే ప్రతిరోజూ ఒక ఆవు మీ ఇంటి ఆవరణలోకి వచ్చి కూర్చున్నా.. లేదా నిలబడి ఉన్నా దాని అర్థం ఏమిటి?

ఇంటి ప్రాంగణంలో పిలవకుండానే ఆవు వచ్చి కూర్చుంటే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తిని దూరం చేయడాన్ని సూచిస్తుంది.

ఇంటి ప్రాంగణంలో లేదా ప్రధాన ద్వారం దగ్గర ఆవు కూర్చుంటే..ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి.

ఇంటి ఆవరణలో ఆవు కూర్చోవడం అంటే పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుందని ,పెట్టుబడి పెట్టిన డబ్బులు వస్తాయని నమ్ముతారు.

దీనితో పాటు ఇంటి ఆవరణలో ఆవు కూర్చోవడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. అంతేకాదు స్థిరత్వానికి సంకేతం కావచ్చు.

ఏదైనా ఆవు మీ ఇంటి గుమ్మం లోపల అడుగు పెడితే, అది విజయానికి సంకేతం. వ్యాపారంలో పురోగతి, కెరీర్‌లో విజయం, దేవుని ఆశీర్వాదాలకు సంకేతం కావచ్చు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వాస్తు శాస్త్రం ఆధారంగా రూపొందించబడింది. TV9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు