15 May 2025
Pic credit: Pexels
TV9 Telugu
కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఓ వరం. వేసవిలో కొబ్బరి నీరు తాగడం వల్ల శరీర వేడి తగ్గి, శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలు.
కొబ్బరి నీరు శక్తిని, బలాన్ని అందిస్తాయి. ఇతర ప్రయోజనాలున్నాయి. వేసవి కాలంలో రోజూ కొబ్బరి నీరు తాగితే ఈ సీజన్ లో ఎదురయ్యే వివిధ సమస్యలను నివారించవచ్చు.
శరీరంలోని అదనపు సోడియంను మూత్రం ద్వారా తొలగించడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. అలాగే రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కనుక హై బీపీ ఉన్నవారు తారచుగా కొబ్బరి నీరు తాగడం మంచిది.
ఇతర జ్యూస్ ల్లో చక్కెర, కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే కొబ్బరి నీరులో కొలెస్ట్రాల్ , కొవ్వు తక్కువగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే డైట్‌లో ఉన్నవారు ఈ పానీయం తాగడం మంచిది.
కిడ్నీ స్టోన్స్ సమస్యను నివారించడానికి.. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. నీరు పుష్కలంగా తాగడంతో పాటు కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలనుకునే వారు కొబ్బరి నీరు త్రాగడం కూడా మంచిది.
తాజా కొబ్బరి నీరులో నిమ్మరసం కలిపి తాగడం మంచిది. రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి. శరీర బరువును తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
కొబ్బరి నీరులో నీటిలో నానబెట్టి సబ్జా గింజలు కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోయి జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. దీనితో పాటు, సబ్జా గింజలు శరీర వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి.
సోంపు గింజలను కొబ్బరి నీరులో వేసుకుని తాగడం చాలా మంచిది. వేసవిలో ఇలా తాగడం వలన శరీరానికి చల్లదనం లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , మలబద్ధకాన్ని నివారిస్తుంది.