15 May 2025
Pic credit: Pexels
TV9 Telugu
ఓట్స్ ఒక ఆరోగ్యకరమైన. పోషకమైన అల్పాహారంగా ప్రాచుర్యం పొందింది. ఓట్స్‌ను ఫిట్‌నెస్ ప్రియులు అల్పాహారంగా తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది వారికి శక్తిని ఇస్తుంది.యు కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
నిజానికి ఓట్స్ ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే కొంతమంది ఓట్స్ తినకూడదని మీకు తెలుసా.
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. అయితే జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు లేదా గ్యాస్, ఉబ్బరం లేదా అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు ఓట్స్ అధికంగా తింటే హానికరం
ఓట్స్‌ను గ్లూటెన్-రహితంగా పరిగణించినా చాలా ప్రాసెస్ చేసిన ఓట్స్ గోధుమ లేదా బార్లీతో ప్రాసెస్ చేయడంతో గ్లూటెన్‌తో కలిసి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో గ్లూటెన్ అంటే అలెర్జీ ఉన్నవారికి ఓట్స్ హానికరం కావచ్చు.
ఓట్స్ డయాబెటిక్ రోగులకు మంచివిగా భావిస్తున్నారు. అయితే మార్కెట్లో లభించే ఫ్లేవర్డ్ ఓట్స్ లేదా ఇన్స్టంట్ ఓట్స్ లో అధిక మొత్తంలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
ఓట్స్‌లో ఫైటిక్ యాసిడ్ అనే మూలకం ఉంది. ఇది శరీరంలో ఇనుము, జింక్ , కాల్షియం శోషణను నిరోధించగలదు. ఇప్పటికే రక్తహీనత లేదా ఐరెన్ లోపంతో బాధపడుతుంటే ప్రతిరోజూ ఓట్స్ తినడం హానికరం.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఓట్స్‌లో ఫాస్పరస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నావారు ఓట్స్ ని తినడం చాలా ప్రమాదకరం.