పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరు? ఎన్ని కోట్ల ఆస్థి తెలుసా

14 May 2025

pic credit: Facebook

TV9 Telugu

2023 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ సమాజం. మొత్తం దేశంలోని 24 కోట్ల మందిలో 5.2 మిలియన్లు హిందువులు. ఇది మొత్తం జనాభాలో 2.17 శాతం.

పాక్ లో హిందూ జనాభా 

భారతదేశంలో చాలా మంది అంబానీలు, అదానీలు ఉన్నారు. కానీ పాకిస్తాన్‌లో ఈ కొద్దిమంది హిందువులలో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరో మీకు తెలుసా?

రిచెస్ట్ హిందువు 

2023లో విడుదలైన జనాభా లెక్కల ప్రకారం దీపక్ పర్వానీ ధనవంతుడైన హిందువు. దీపక్ వృత్తిరీత్యా నటుడు , ఫ్యాషన్ డిజైనర్. అతని దగ్గర ఎంత సంపద ఉందంటే

దీపక్ పర్వానీ

దీపక్ 1974లో సింధ్ ప్రావిన్స్‌లోని మీర్పూర్ ఖాస్‌లో సింధీ హిందూ కుటుంబంలో జన్మించాడు. మొదట 1996లో వెలుగులోకి వచ్చాడు. సొంతంగా చాలా అందమైన కోచర్ హౌస్ 'DP'ని స్థాపించాడు.

సింధీ హిందూ

దీపక్ స్వదేశంలో, విదేశాలలో చేసిన కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు అందుకున్నాడు. 2014లో బల్గేరియన్ ఫ్యాషన్ అవార్డులలో  ఆరవ ఉత్తమ ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు పొందాడు.

ఫ్యాషన్ డిజైనర్‌

ప్రపంచంలోనే అత్యంత పొడవైన 101 అడుగుల కుర్తాను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కెక్కాడు. దీపక్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్, బాలీవుడ్ నటి షబానా అజ్మీలకు దుస్తులను డిజైన్ చేశాడు.

101 అడుగుల కుర్తా

పాకిస్తాన్ హిందువులలో దీపక్ అత్యంత ధనవంతుడు. 2022 నివేదిక ప్రకారం అతని మొత్తం ఆస్తులు నికర విలువ దాదాపు రూ.71 కోట్లు. ఈ జాబితాలో దీపక్ సోదరుడు ఉండటం గమనార్హం.

ఎన్ని కోట్ల ఆస్థి అంటే

దీపక్ సోదరుడు నవీన్ పర్వానీ కూడా పాకిస్తాన్ లోని ధనిక హిందువుల జాబితాలో ఉన్నాడు. ప్రొఫెషనల్ స్నూకర్ ఆటగాడిగా నవీన్ కు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అతని మొత్తం ఆస్తులు దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్లు అంచనా 

దీపక్ తమ్ముడు నవీన్