13 May 2025
pic credit: pexel/getty
TV9 Telugu
ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. కనుక డ్రై ఫ్రూట్స్ ని తింటారు. ఇందులో ఎండుద్రాక్ష కూడా ఉంది. దీనిని పాయసం, కేక్ , అనేక ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
ఎండుద్రాక్ష తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో సమృద్ధిగా ఐరెన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి లు కూడా ఉన్నాయి.
ఎండుద్రాక్షలో ఐరెన్ అధిక మొత్తంలో లభిస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల శరీరానికి మంచి మొత్తంలో ఐరెన్ లభిస్తుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాలు పెరిగి రక్తహీనత నయమవుతుంది.
ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉన్నాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాదు ఆమ్లత్వం వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు అనేక ప్రయోజనాలున్నాయి.
ఎండుద్రాక్షలను సరైన రీతిలో, పరిమిత పరిమాణంలో తినాలి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు వాటిని తినాలి. ఆ నీటిని కూడా తాగవచ్చు.
రాత్రి 10 నుంచి 20 ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి.. వాటిని మర్నాడు ఉదయం తినవచ్చని ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా తెలిపారు. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎండుద్రాక్షలు సహజమైన తీపిని కలిగి ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ లేదా ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు రోజూ తినాలంటే నిపుణుడిని సంప్రదించాలి .