పెసర మొలకలు తింటున్నారా.. ఏ సమయంలో తింటే ప్రయోజనమో తెలుసా..   

24 May 2025

Pic credit: Google

TV9 Telugu

పెసలు సూపర్ ఫుడ్. ఇందులో ఫైబర్, పొటాషియం, బి6 , ఐరన్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిని నానబెట్టిన తర్వాత మరింత ప్రయోజనకరంగా మారతాయి. 

పెసలు పోషకాలు 

కొంతమంది పెసలను నానబెట్టిన మొలకలు వచ్చాక తినడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ మొలకలను ఎప్పుడు ఎప్పుడు తినాలో తెలియక అయోమయంలో ఉంటారు - ఏ సమయంలో తినాలంటే 

పెసర మొలకలు సూపర్ ఫుడ్

పెసర మొలకలు తినడానికి సరైన సమయం ఉదయం. అది కూడా ఖాళీ కడుపుతో. నానబెట్టినపెసర మొలకలను తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

మొలకలు తినడానికి బెస్ట్ టైం  

పెసర మొలకలు చాలా తేలికగా ఉంటాయి. వీటిని తిన్న తర్వాత, కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో పెసర మొలకలు తినడం అవసరానికి అనుగుణంగా , పరిమిత పరిమాణంలో ఉండాలి. 

అతిగా తినోద్దు 

పెసర మొలకలు  కడుపుకు ఒక వరం. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

కడుపుకు ఒక వరం 

రాత్రిపూట నానబెట్టిన పెసర మొలకలలో విటమిన్ ఎ, జింక్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే కళ్ళకు మేలు చేస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

కళ్ళకు మేలు 

పెసర మొలకల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిల్లో ఫైబర్ , ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కడుపు నిండుగా ఉంచుతాయి. బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అతిగా తినాలన కోరిక కలగకుండా చేస్తుంది. 

బరువు తగ్గడంలో సహాయం