గడప దగ్గర దీపాలు ఎందుకు వెలిగించాలి? ఏ సమయంలో వెలిగించాలి?
07 June 2025
Pic credit: Google
TV9 Telugu
హిందూ మతంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం. పూజలు , శుభకార్యాలు , మతపరమైన ఆచారాలతో పాటు, పండగల సమయంలో ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు.
చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, అంటే గడప దగ్గర దీపం వెలిగించడం మీరు చూసి ఉంటారు. ఇలా గడప దగ్గర దీపం వెలిగించడం వెనుక ఉన్న కారణం నమ్మకం ఏమిటో తెలుసుకుందాం.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల సానుకూలత వస్తుంది. ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల ఆనందం , శాంతి లభిస్తాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.
ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది, అదృష్టం వస్తుంది. సంపద పెరుగుతుంది.
ఇంటి ముంగిట దీపం వెలిగించడం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది.. ఆ ఇంట్లో నివసించే వారి కష్టాలు తొలగిపోతాయి.
ఇంటి గుమ్మం దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. రాహువు చెడు ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఇంటి గుమ్మం దగ్గర దీపం వెలిగించవచ్చు. ఇలా చేయడం మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే.. ఇది నిజం అని టీవీ 9 తెలుగు దృవీకరించడం లేదు.