వర్షాకాలంలో కప్పలు ఎక్కువగా కనిపిస్తాయి. బయట తిరుగుతున్నప్పుడు ఈ కప్పలు అకస్మాత్తుగా ఇంట్లోకి వస్తాయి.. ఇది శుభమా లేక అశుభమా?
కప్పలు ఆనందం, అదృష్టానికి చిహ్నం. అందువల్ల వాటి ఆకస్మిక ప్రదర్శన శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ఇంట్లో కప్ప రాక కూడా ఒక పెద్ద సంకేతాన్ని ఇస్తుంది.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద కప్పను చూసినట్లయితే లేదా మీరు ఎక్కడికైనా వెళ్తుండగా కప్ప మీ ముందు నుంచి వెళ్లిపోతే జీవితంలోకి శ్రేయస్సు రాబోతోందని అర్థం చేసుకోండి.
ఇంటి తలుపు ముందు కప్పను చూడటం మంచి ఆరోగ్యానికి చిహ్నమని నమ్ముతారు.
అలాగే ఒక కప్ప మీ ఇంట్లోకి ప్రవేశిస్తే.. దానిని ఆనందం , శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.
ఇంట్లోకి కప్ప రాక సంపద రాకను, అలాగే మీ పెండింగ్ పని పూర్తి కావడాన్ని సూచిస్తుంది. ఇంట్లో కప్ప రాక కూడా కొన్ని సానుకూల మార్పులను సూచిస్తుంది.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వాస్తు , జ్యోతిషశాస్త్రం ఆధారంగా రూపొందించబడింది. TV9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు