ఆరోగ్యానికి సిరి ఈ ఉసిరి.. రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా
21 June 2025
Pic Credit: Pexel
TV9 Telugu
అస్తమా, బ్రాంకైటిస్ ఉన్నవాళ్లు ఉసిరి జ్యూస్ లో తేనె కలిపి రోజుకి రెండుసార్లు తీసుకుంటే చాలు. అద్భుతమైన ఫలితం ఉంటుంది.
ఉసిరిలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు వుండటం వల్ల వృధాప్య ఛాయలను దరిచేరనివ్వదు.
తేనెతో కలిపి ఉసిరి జ్యూస్ ని తీసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఆడవారిలోని ఋతుక్రమ సమస్యలు తగ్గుతాయి.
వేసవిలో ఈ ఉసిరి జ్యూస్ ని త్రాగడం వల్ల మన శరీరానికి కావలసిన తేమని పుష్కలంగా ఇస్తుంది.
రోజూ ఉసిరిని తీసుకోవడం వల్ల పేగు కదలికలను క్రమబద్ధం చేసి దీర్ఘకాలిక మలబద్దకం నియంత్రిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త హీనత నుంచి రక్షిస్తుంది.
ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. శక్తిని ఇస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
రోజూ ఉసిరిని ఏదోక రూపంలో తింటే కంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది.
కీళ్ల నొప్పి ఉన్నవాళ్లు ఈ ఉసిరి పొడిని లేదా ఉసిరి జ్యూస్ ని రోజు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉసిరి రసం గుండెకు బలాన్ని ఇవ్వడంతో పాటు గుండె కండరాలకు, గుండె సంభదిత సమస్యలకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
ల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.