ఈ 5 ప్రదేశాలలో ఇంటిని నిర్మిస్తే నరకంతో సమానం.. ఆ ప్రదేశాలు ఏమిటంటే.. 

18 June 2025

Pic Credit: Pexel 

TV9 Telugu

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో అలాంటి ఐదు ప్రదేశాల గురించి ప్రస్తావించాడు. అటువంటి ప్రదేశంలో ఎవరైనా సరే తన కలల ఇంటిని నిర్మించకూడదు.

లోకయాత్రా భయం లజ్జా దక్షిణ్యం త్యాగశీలతా । పఞ్చ యత్ర న వర్తన్తే న కుర్యాత్ తత్ర సంస్థిః అనే శ్లోకం ద్వారా చాణక్యుడు ఎక్కడ ఇంటిని నిర్మించవద్దో చెప్పాడు

ఈ శ్లోకం ద్వారా  చాణక్యుడు మానవులు నివసించడానికి నిషేధించబడిన ఐదు ప్రదేశాలను పరిగణించాడు. ఆ ప్రదేశాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..  

జీవనోపాధి లేని చోట ఒక వ్యక్తి నివసించకూడదు. జీవనోపాధి లేదా వ్యాపారం లేని చోట ఇంటిని నిర్మించవద్దు 

డబ్బులు లేకుండా మానవ జీవితం ముందుకు సాగదు. కనుక ఒక వ్యక్తి తన ఆదాయ వనరులను దృష్టిలో ఉంచుకుని తన నివాస స్థలాన్ని ఎంచుకోవాలి.  

భయంకరమైన లేదా భయానక వాతావరణాన్ని కలిగి ఉన్న ప్రదేశంలో ఎప్పుడూ ఇల్లు నిర్మించకూడదు.  

సమాజం లేదా చట్టం పట్ల భయపడని వ్యక్తులున్న ప్రదేశంలో నివసించకూడదు. అలాంటి ప్రదేశంలో నివసించడం కుటుంబానికి హాని కలిగిస్తుంది.

ప్రజా అవమాన భావనను పట్టించుకోని ప్రదేశంలో ఇల్లు కట్టుకోకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశంలో నివసించడం వల్ల గౌరవం రాదు.

దాతృత్వ భావాలున్న వ్యక్తులు లేని.. త్యాగ స్ఫూర్తి లేని ప్రజలున్న ప్రదేశంలో నివసించకుండా ఉండాలి.