బెండకాయ నీరు నిమ్మరసం కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
13 June 2025
Pic Credit: Pexel
TV9 Telugu
బెండకాయ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బెండకాయ చల్లదనాన్ని ఇస్తుంది. కనుక వేసవి కాలంలో దీనిని ఇష్టంగా తింటారు. అయితే బెండకాయని రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం ఆ నీటిని త్రాగవచ్చని మీకు తెలుసా! ఆ నీటికి నిమ్మకాయ రసం కలిపితే రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుంది.
నిమ్మకాయరసంలో యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలున్నాయి. అందువల్ల బెండకాయ నీటిలో నిమ్మరసంతో కలిపి తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బెండకాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం నిమ్మకాయతో కలిపి తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని డాక్టర్ శైలేంద్ర మిశ్రా చెప్పారు. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బెండకాయ,నిమ్మరసం నీరు బరువు తగ్గింస్తుంది. ఎందుకంటే ఈ రెండిటిలో కేలరీలు తక్కువగా.. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు.
బెండకాయలో ఫైబర్, మ్యూసిలేజ్ ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపదుతుంది. బెండకాయ నీటిలో నిమ్మరసం కలిపి తాగినప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి షుగర్ ని నియంత్రిస్తుందని డాక్టర్ చెప్పారు
బెండకాయలో ఉన్న ఫైబర్ మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. నిమ్మకాయ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.