టీ తాగందే రోజు గడవదా..! రోజులో ఎంత టీ తాగాలో తెలుసా
24 June 2025
Pic Credit: freepik.com
TV9 Telugu
టీ , కాఫీలను ఇష్టంగా తాగేవారు చాలా మంది ఉన్నారు. రోజుని టీతో మొదలు పెడతారు. టీతోనే ముగిస్తారు. అయితే రోజుకి అసలు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..
టీ ముఖ్యంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, లేదా హెర్బల్ టీ, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పానీయం. ఇది రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
కానీ రోజులో ఎంత టీ తాగడం ఆరోగ్యకరం అనేది టీ రకం, వ్యక్తి ఆరోగ్యం, దానికి జోడించిన పదార్థాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం సగటు ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 2-3 కప్పుల టీ (ఒక కప్పుకు దాదాపు 200 మి.లీ) తాగడం వల్ల ఎటువంటి హాని జరగదు. ప్రయోజనకరంగా ఉంటుంది.
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు (కాటెచిన్స్ వంటివి) గుండె ఆరోగ్యం, జీవక్రియ , క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. బ్లాక్ టీ, హెర్బల్ టీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
టీ అధికంగా తాగడం వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు, కడుపునొప్పి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఈ తరహా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఎక్కువ టీ తాగడం హానికరం. ఎక్కువ టీ తాగడం వల్ల దానిలోని కెఫిన్ వల్ల నిద్రలేమి బారిన పడేలా చేస్తుంది. ఇది ఆందోళన , కడుపు సమస్యలను కలిగిస్తుంది.