వర్షాకాలంలో ప్రకృతి వరం వాక్కాయ.. తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
26 June 2025
Pic Credit: freepik.com
TV9 Telugu
విటమిన్ సి అధికంగా ఉన్న ఈ వాక్కాయ.. అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కలిగి ఉంటుంది.
వగరుపులుపు కలిసిన ఈ వాక్కాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఉదర సమస్యలను నివారించడానికి ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తొలగించడానికి సహాయపడుతుంది.
ఎండిన పండ్ల పొడిని నీటితో కలిపి తీసుకుంటే.. కడుపుని తేలికపరుస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, దీంతో ఆకలిని పుట్టేలా చేస్తుంది.
పూర్వకాలంలో జ్వరం వస్తే చికిత్స కోసం వాక్కాయని ఉపయోగించేవారు. దీనిలోని పోషకాలు అంటువ్యాధులతో పోరాడటం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
సీజన్ లో దొరికే ఈ వాక్కాయను తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్లు, ట్రిప్టోఫాన్లతో పాటు మెగ్నీషియం ఉండటం సిరోటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.
వాక్కాయ జ్యూస్ తాగడం వలన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె కండరాలను బలోపేతం చేయడానికి రోజూ 15 నుంచి 20 మి.లీ వాక్కాయ రసం తీసుకోవాలి.
శరీరం డీహైడ్రేషన్ బారిన పడితే.. తక్షణ శక్తిని వాక్కాయ ఇస్తుంది. అంతేకాదు శరీరంలోని మంటను తగ్గిస్తుంది.
వాక్కాయ శరీరంలోని పిత్తాశయం, చిగుళ్ళలో రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను నివారిస్తుంది.
ప్రతిరోజూ వాక్కాయల రసం తాగడం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. దంత క్షయం నివారిస్తుంది. నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది.
మెదడు సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ మాత్రమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా వాక్కాయలు మంచి మెడిసిన్.